Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టాలీవుడ్ లో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు తెరకెక్కించిన ఈ సినిమాలో.. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ప్యూర్ ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్ కథతో వచ్చిన బలగం ఆడియన్స్ మనసును హత్తుకుంది..వారి చేత కన్నీళ్లు పెట్టించింది. బలగంలో బంధాలు, వాటి మధ్య ఉండే సంబంధాలకు పెద్ద పీట వేయడంతో ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. దీంతో.. బాక్సాఫీస్ దగ్గర రూ. 50 కోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టింది. కలెక్షన్స్ పరంగానే కాదు.. అవార్డులు పరంగా కూడా బలగం మూవీ సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో 9 అవార్డులను కైవసం చేసుకున్న బలగం.. ప్రపంచవ్యాప్తంగా పలు క్యాటగిరిలో మొత్తం 40కి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.
తాజాగా బలగం సినిమా మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. ఈ సినిమాకి సంగీతం అందించిన భీమ్స్ సెసిరోలియో 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డ్ అందుకున్నాడు. ఈ కేటగిరీలో దాదాపు 81 దేశాలు నుంచి 780 మంది పోటీ పడగా.... అందులో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ భీమ్స్ ని వరించింది. దీంతో చిత్ర యూనిట్, టాలీవుడ్ ప్రముఖులు, ఆడియన్స్ భీమ్స్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆస్కార్ కి కూడా పంపిస్తామని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు.