Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ: 2023, ‘మే’ డేన కీలక తీర్పు వెల్లడైంది. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు విడాకుల మంజూరుపై కీలక తీర్పు వెలువరించింది. విడాకుల ప్రక్రియను ధర్మాసనం మరింత సులభతరం చేసింది. విడాకుల కోసం 6 నెలలు వేచి చూడాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. దంపతులు కోరుకుంటే వెంటనే విడాకుల మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వివాహ బంధం మెరుగుపర్చుకోవడానికి అవకాశం లేని కేసుల్లో వెంటనే విడాకులు మంజూరు చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీం ఈ తీర్పు వెల్లడించడం గమనార్హం. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. ఈ బెంచ్‌లో జస్టిస్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్. ఓకా, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరి సభ్యులుగా ఉన్నారు.