Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 4,282 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Minister) వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్గా (Active Cases) ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,70,878 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,547కి చేరింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.11 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,66,433) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.