Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తమిళనాడు
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. వేడివేడి రసంలో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తిరువళ్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.. కళాశాలలో చదువుకునే 21 ఏండ్ల విద్యార్థి ఓ కేటరింగ్ సంస్థలో పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గతవారం జరిగిన ఓ వివాహ వేడుకలో అతిథులకు వడ్డిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థి ప్రమాదవశాత్తు అతిథుల కోసం సిద్ధం చేసిన వేడివేడి రసంలోకి పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు ఆదివారం ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వారు వెల్లడించారు.