Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిద్దిపేట
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో అపహరణకు గురైన నాలుగేండ్ల చిన్నారి ఆచూకీ లభ్యమైంది. చిన్నారిని అపహరించిన దంపతులను పోలీసులు సోమవారం ఉదయం హైదరాబాద్‌లో గుర్తించి.. చిన్నారిని సురక్షితంగా రక్షించారు. దౌల్తాబాద్‌కు చెందిన బర్ల మమత, ప్రభాకర్ దంపతుల నాలుగేండ్ల కుమార్తె బర్ల శైలజ ఆదివారం ఉదయం తాత ఎల్లయ్యతో కలిసి కిరాణా దుకాణానికి వెళ్లింది. అక్కడ ఎల్లయ్య సరకులు తీసుకునే పనిలో చిన్నారిని గమనించలేదు. పనిపూర్తైన తర్వాత చూడగా అక్కడ పాప కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన ఎల్లయ్య చుట్టుపక్కల అంతా వెతికినా పాపా ఆచూకీ లభించలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
చిన్నారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు కిరాణా దుకాణం సమీపంలోని సీసీకెమెరాలను పరిశీలించగా దంపతులు పాప చెయ్యి పట్టుకొని స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వరకు వెళ్తున్నట్లు కనిపించింది. అక్కడి నుంచి గజ్వేల్ పట్టణానికి, ఆ తరువాత హైదరాబాద్ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. ఈ క్రమంలో దంపతులను సోమవారం ఉదయం హైదరాబాద్‌లో గుర్తించి చిన్నారిని సురక్షితంగా రక్షించారు.