Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ: మూసీ నదికి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నదికి వరద పరవళ్లు తొక్కుతోంది. మూసీ ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,860 క్యూసెక్కులుగా ఉంది. మూసీ ఉపనది బిక్కేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సోలిపేట వద్ద ప్రాజెక్టుకు ఇన్ఫ్లో గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనాలను నిలిపివేశారు. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 632.7 అడుగులకు చేరింది. సూర్యాపేట, మేళ్లచెరువు, మఠంపల్లి, చివ్వెంల, హుజూర్నగర్, పాలకీర్దు మండలాల్లో సోమవారం ఉదయం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎలాంటి పంట నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.