Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సూపర్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్...212 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (124) శతకం బాదాడు. టార్గెట్ ఛేజింగ్‌లో ముంబై బ్యాట్స్‌మన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీం213 పరుగుల టార్గెట్‌ను ముంబై 19.3 ఓవర్లలోనే ఛేదించింది.
రాజస్థాన్ రాయల్స్ పై భారీ టార్గెట్‌ను ఛేదిస్తామని అస్సలు ఊహించలేదని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. భారీ టార్గెట్‌ను ఛేజ్ చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు. గత మ్యాచ్‌లో కూడా భారీ స్కోరును ఛేదించలేక చతికిలపడ్డామని.. గుర్తుచేశాడు. అయితే ఈ మ్యాచులో అలాంటి పొరపాటు చేయలేదన్నాడు. టీమ్ డేవిడ్ కు పొలార్డ్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉందన్నాడు. జట్టులో మార్పులు చేయడం చాలా కష్టమైన పని అన్నాడు.
ఈ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ అద్భుతంగా ఆడాడని రోహిత్ శర్మ కొనియాడాడు. జైస్వాల్ ఆటతీరును గతేడాదే చూశానని..ఈ ఏడాది అతను మరింత మెరుగయ్యాడని కొనియాడాడు. అతనికి ఇంత పవర్ ఎక్కడి నుంచి వస్తుందని తనను అడిగినట్లు చెప్పుకొచ్చాడు. యశస్వీ జైస్వాల్ వంటి ఆటగాడు వెలుగులోకి రావడం భారత్‌కు, ఆర్ఆర్ టీమ్ కు మంచిపరిణామమని పేర్కొన్నాడు.