Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నూతన సచివాలయానికి వెళ్లేందుకు వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఓఆర్ఆర్ టెండర్పై సోమవారం సచివాలయం అధికారులను కలిసేందుకు వచ్చిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అధికారులును కలిసేందుకు రేవంత్ రెడ్డి అనుమతి తీసుకోలేదని, అందుకే అడ్డుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు, ఓఆర్ఆర్ టెండర్లో రూ.వేలకోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించి, బారికేడ్లు ఏర్పాటు చేశారు.