Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి బాలాత్రిపుర సుందరమ్మ ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో, సీఎం జగన్ విజయవాడ ఎంజీ రోడ్ లోని మల్లాది విష్ణు నివాసానికి వచ్చారు. తల్లి మరణంతో బాధపడుతున్న మల్లాది విష్ణును పరామర్శించారు. బాలాత్రిపుర సుందరమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అక్కడున్న ఆమె చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన వెంట మంత్రి జోగి రమేశ్ కూడా ఉన్నారు.