Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగిత్యాల : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం మల్యాల పోలీస్ స్టేషన్ కి చెందిన మహిళా కానిస్టేబుల్ వేదశ్రీ నడుపుతున్న ద్విచక్రవాహనం మల్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద అదుపుతప్పి కింద పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలుకాగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళా కానిస్టేబుల్ భౌతికాయానికి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో జిల్లా ఎస్పీ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.