Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 16వ సీజన్ 43వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. తొలి రౌండ్లో లక్నో ఆఖరి ఓవర్లో ఆర్సీబీకి షాకచ్చింది. దాంతో, ఈసారి ఆ జట్టును సొంతగడ్డపై ఓడించాలని డూప్లెసిస్ సేన భావిస్తోంది. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రికార్డు స్టోర్ చేసిన లక్నో జోరుమీదుంది. ఓపెనర్ కైల్ మేయర్స్, స్టోయినిస్, నికోలస్ పూరన్ భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. ఇక కాసేటి క్రితం టాస్ వేయగా బెంగళూరు జుట్టు టాస్ గెలిచింది. దీంతో డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
కెప్టెన్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌పై ఆర్సీబీ ఎక్కువగా ఆధారపడుతోంది. డూప్లెసిస్ సేన కోల్‌కతాపై గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓడిపోయింది. ప్లే ఆఫ్ రేసు దగ్గరపడుతోంది. దాంతో, ఇరుజట్లు విజయంపై కన్నేశాయి.