Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : విరాట్ కోహ్లిని ఎవరైనా కవ్విస్తే అస్సలు తగ్గే రకం కాదు. తనకు కలిసి రానపుడు ఎవరైనా రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే.. తన అచ్చి వచ్చినపుడు అంతకు రెండింతలు తిరిగి ఇచ్చేయడం అతడికి అలవాటు. గత నెల 10న బెంగళూరును దాని సొంతగడ్డపై లక్నో ఓడించినపుడు స్టేడియంలో బెంగళూరు అభిమానుల వైపు చూస్తూ లక్నో మెంటార్ గంభీర్.. నోటికి తాళాలు వేసుకోమన్నట్లుగా సంజ్ఞ చేశాడు. దాన్ని మనసులో పెట్టుకున్న కోహ్లి.. సోమవారం బెంగళూరు గెలుపు బాటలో సాగుతున్నపుడు రెచ్చిపోయాడు. కృనాల్ క్యాచ్‌ను అందుకున్నపుడు గంభీర్‌లా చేయకూడదని సూచిస్తూ, ముద్దు పెడుతున్నటు సంజ్ఞ చేయడమే కాక.. వికెట్ పడ్డ ప్రతిసారీ సంబరాలను పతాక స్థాయికి తీసుకెళ్లాడు. మ్యాచ్ ముగిశాక కోహ్లి, గంభీర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది వారిని విడదీశారు.