Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నిన్న లక్నో, బెంగళూర్ మ్యాచ్ అనంతరం కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగిన నేపథ్యంలో రిఫరీ సీరియస్ గా స్పందించారు. వారిద్దరి మ్యాచ్ ఫీజులో ఏకంగా 100% ఫైన్ విధించారు. అలాగే గొడవకు కారణమైన లక్నో ఆటగాడు నవీన్ ఉల్ హాక్ కు 50% ఫైన్ విధించారు. ఐపిఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, త్వరలో వీరితో రిఫరీ స్వయంగా మాట్లాడనున్నట్టు సమాచారం. కాగా, ఐపిఎల్ 2023 లో భాగంగా జరిగిన నిన్న జరిగిన మ్యాచ్ లో లక్నో పై బెంగళూర్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డుప్లిసిస్ సేన నిర్ణీత ఓవర్ లలో 9 2 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది.మొదటి నుండి పిచ్ లో వేగం లేకపోవడం తో స్పిన్నర్లు చెలరేగి పోయారు. పరుగులు చేయడం చాలా కష్టంగా మారింది. అనంతరం 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో మరో ఒక బంతి మిగిలి వుండగానే 108 పరుగులకు ఆల్ ఔట్ అయి 18 పరుగుల తేడాతో ఓటమి పాలయింది.