Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బిహార్ ముజఫర్‌పుర్ జిల్లాలోని రామ్‌దయాళ్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాలికలు సజీవదహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇంట్లోని సామగ్రి మొత్తం కాలి బుడిదైంది.
రామ్‌దయాళ్ ప్రాంతంలోని స్లమ్‌లో నివసించే ఓ కుటుంబానికి సంబంధించిన ఇంట్లో అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇవి కాస్త పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లకి వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు బాలికలు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని ఎస్కేఎమ్సీఎచ్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.