Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ఉపాధి కల్పనతో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డిలో ఫిప్కార్ట్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం ఐటీసీ కాకతీయలో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా మారుద్దామన్నారు. ఇప్పుడు తెలంగాణ చేస్తున్నది.. రేపు యావత్ భారతదేశం ఫాలో అవుతుందని చెప్పారు. ఈ కామర్స్ రంగం వేగంగా దూసుకెళ్తోందన్నారు. ఉపాధి కల్పనలో 50 శాతం మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో కేవలం ఫ్లిప్‌కార్ట్ ద్వారానే సుమారు 40వేల మందికి ఉపాధి లభిస్తోందని.. ఇది గర్వకారణమన్నారు. ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇది తెలంగాణలోనే అతిపెద్ద ఫెసిలిటీ సెంటర్ అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకారం అందించడం ఆనందంగా ఉందన్నారు.