Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాను రిటైర్మెంట్ ప్రకటించినా.. బలహీన వర్గాలు, యువత, విద్యార్థుల ప్రోత్సాహానికి కృషి చేస్తానని చెప్పారు. ముంబయిలో తన ఆత్మకథ పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు పవార్. ఈ కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించడానికి పార్టీ సీనియర్ నేతలతో కూడిన ఓ ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు పవార్ ప్రకటించారు.