Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జూబ్లీహిల్స్: ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడకు చెందిన భీమ్శంకర్ తన భార్య పిల్లలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ బైక్‌షోరూంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. షోరూం ప్రాంగణంలోనే ఓ గదిలో అతడి కుటుంబం నివాసముంటోంది. అతడి కుమారుడు వివేకానంద (6) ఎప్పటిలాగే స్నేహితులతో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకునేందుకు వెళ్లాడు.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి గుంతలో నీరు చేరింది. ఆ గుంతలో పడిన కర్రను తీసే క్రమంలో ప్రమాదవశాత్తు వివేకానంద అందులో పడిపోయాడు. స్నేహితులు ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు అక్కడికి చేరుకునేలోపే వివేకానంద నీటిలో మునిగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై దాలి నాయుడు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.