Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం రెండో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో కొత్తగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును కూడా చేర్చింది. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మాజీ సెక్రటరీ సీ అరవింద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చద్దా పేరును చార్జిషీట్లో చేర్చినట్లు తెలిపింది. ఢిల్లీలో 2021-22కు సంబంధించిన లిక్కర్ పాలసీపై గతంలో మనీశ్ సిసోడియా ఇంట్లో సమావేశం జరిగిందని, ఆ సమావేశానికి రాఘవ్ చద్దా కూడా హాజరయ్యారని ఈడీ దర్యాప్తులో సిసోడియా సెక్రెటరీ సీ అరవింద్ వెల్లడించాడు. వారితోపాటు పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజమ్, విజయ్ నాయర్, పంజాబ్ ఎక్సైజ్ డైరెక్టరేట్కు సంబంధించిన పలువురు అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారని చెప్పాడు.
సీ అరవింద్ వాంగ్మూలం ఆధారంగా ఈడీ ఇప్పుడు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును సప్లిమెంటరీ చార్జిషీట్లో చేర్చింది. గతంలో సీబీఐ కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి అక్కడి సీబీఐ కోర్టులో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరును ఆ సప్లిమెంటరీ చార్జిషీట్లో చేర్చింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఆయనను అరెస్ట్ చేసింది.