Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మన సినిమాలు .. మన నటీనటులకు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. నైజీరియాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'లో మన హీరో జేడీ చక్రవర్తికి అవార్డు లభించింది. జేడీ చక్రవర్తి హీరోగా.. విలన్‌గా.. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు 'ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'లో అరుదైన అవార్డు లభించింది.
ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జేడీ చక్రవర్తికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో అవార్డు వచ్చింది. 'దహిణి ది విచ్' అనే సినిమాలోని నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు లభించింది. దీంతో జేడీ చక్రవర్తి మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జేడీ చక్రవర్తికి ఈ గుర్తింపు లభించడంతో ఆయన అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఈ సినిమాకి ఆస్ట్రేలియాలోనూ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డును అందుకుంది. ఈ సినిమాకు రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వం వహించారు. సునీతా కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తనిష్ట ఛటర్జీ, జేడీ చక్రవర్తి, శ్రుతి జయన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు 18 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.