Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో తేలియాడుతున్న ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని రాంగోపాల్‌పేట్ పోలీసులు వెలికితీశారు. సోమవారం పెట్రోలింగ్లోఉ న్న లేక్ పోలీసులకు సాగర్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం తేలియాడుతున్నట్లు సమాచారం రావడంతో డీఆర్ఎఫ్ బృందాల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలికి 25నుంచి 30 ఏళ్ల వయస్సు ఉంటుందని ఒంటిపై క్రీం కలర్ టాప్, ఎరుపు రంగు ప్యాంటు ధరించి ఉందని పోలీసులు తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 040-27853595 9948031574 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.