Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంసెట్‌కు ఈ ఏడాది అదనంగా 50వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటికే 2లక్షలకు పైగా విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు.
‘‘ఎంసెట్‌కు 28 కొత్తవి సహా మొత్తం 137 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఆలస్యమైతే అనుమతించేది లేదు. లాసెట్‌ను ఒకే రోజు మూడు సెషన్లలో నిర్వహిస్తున్నాం. ఈసెట్ ఒకే పూటలో పూర్తిచేసేలా ఏర్పాట్లు చేశాం. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ప్రాసెస్‌లో ఉంది’’అని చెప్పారు. జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది కొత్తగా బయోటెక్నాలజీ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. కొత్త కోర్సుల కోసం ప్రైవేట్ కాలేజీల దరఖాస్తులు ఏఐసీటీఈ పరిశీలనలో ఉన్నాయన్నారు. కాలేజీల్లో తనిఖీలు మరో నాలుగైదు రోజుల్లో పూర్తవుతాయని వీసీ తెలిపారు. మే 10 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్, మెడికల్.. 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.