Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐతో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. వీరు ప్రయాణిస్తున్న కారు బోల్తాపడడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏటూరునాగారం మండం జీడివాగు వద్ద మంగళవారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఘటనలో ఎస్ఐ ఇంద్రయ్యతో పాటు ప్రైవేటు డ్రైవర్ మృతి చెందారు. ఇందిరయ్య ఏటూరునాగారం ఎస్ఐగా పని చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.