Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రీరామ గార్డెన్స్ లో మున్సిపల్ కార్మికులకు ఆత్మీయ సన్మానం మంగళవారం నిర్వహించారు. 1500 మంది మున్సిపల్ కార్మికులకు బట్టలు పంపిణీ చేసి వారితో సహా పంక్తి భోజనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ....సంపదలకు మూలం కార్మికుల స్వేదం. శ్రామికుల సంక్షేమామే తెలంగాణ ప్రభుత్వ ద్యేయం. పట్టణాలు - పల్లెలు అభివృద్ధిలో పారిశుద్ధ్య కార్మికులది కీలక పాత్ర. 106,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు మేడే కానుకగా వేతనం 1000 రూ పెంచిన్నట్లు తెలిపారు. బిఆర్ఎస్ హయాంలో కనీస వేతనం అమలు, స్వరాష్టంలో సూపరి పాలన, రాష్ట్రంలో మొదటగా నిజామాబాద్ నగర పాలక సంస్థలో వేతనాలు పెంపు, నిజామాబాద్ నగరంలో కార్మికులకు పనిభారం తగ్గించేందుకు కొత్త సిబ్బందిని నియమించామన్నారు. కార్మికుల కోసం ప్రత్యేక కంటి వెలుగు-కంటి వైద్య శిబిరం. కార్మికులకు నిరంతరం అందుబాటులో ఉంటాను. మీ సేవలకు నా సలామ్!మీరు చేసే శ్రమ గొప్పది-మీ సేవలు వేల కట్ట లేనివి. నిజామాబాద్ నగరం సుందరీకరణలో పారిశుద్ధ్య కార్మికుల కృషి అమోఘం. మీ కృషితో తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలకు, పట్టణాలకు అవార్డులు వచ్చాయి. కరోన కష్ట కాలంలో మీ ప్రాణాలను అడ్డు పెట్టి నిజామాబాద్ నగర ప్రజల కోసం పనిచేశారు. మీ సేవలకు మీరు పనిచేస్తున్న చోటునే నా సొంతంగా భోజనం వితరణ చేసాను. దేశం అంత లాక్ డౌన్ ఉన్న మున్సిపల్ కార్మికులు ధైర్యంగా పనిచేసారు. పారిశుద్ధ్య కార్మికులు మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. మీరు బాగుంటేనే నగరం బాగుంటుంది.మీ శ్రేయస్సు కోరి ఏ ఒక్క కార్మికుడు ద్రుష్టి లోపంతో భాధపడకుండా ఉండేందుకు కొరకు మున్సిపల్ కార్యాలయంలో కంటి వెలుగు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసాము. పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిది. పారిశుద్ధ్య కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంతో ఆలోచించి వేతనాలు పెంచారు. అను నిత్యం ప్రజారోగ్య రక్షణకు విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులకు సముచిత గౌరవంగా ఆత్మీయ సన్మానం.మరింత నిబద్ధతతో, చిత్త శుద్ధి తో మనస్ఫూర్తిగా పనిచేయండి. మీకు ఏ కష్టం ఆపద వచ్చినా మీకు అండగా ఉంటానని తెలియచేస్తున్నాను.ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత బిఆర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్,సత్య ప్రకాష్, నవీద్ ఇక్బల్, సిర్ప రాజు, రాజు, దారం సాయిలు, కార్పొరేటర్ లు మల్లేష్ యాదవ్, వెల్డింగ్ నారాయణ, అక్బర్ హుస్సేన్, అబ్దుల్ కుద్దుస్, బిఆర్ఎస్ కార్మిక విభాగం పట్టణ-అధ్యక్ష కార్యదర్శులు విజయ లక్ష్మి-అహ్మద్, రాజేంద్ర ప్రసాద్, బిళ్ళ మహేష్, మాయవార్ సాయిరాం, చాంగు భాయి, గంగమని, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.