Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఈనెల 5 నుండి 7వ తేదీ వరకు రాంపూర్ రెవెన్యూ గ్రామంలో నిర్వహించే బొడ్రాజి ప్రతిష్టాపన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే నాభి శిల బొడ్రాయి శ్రీదేవి భూదేవిలా ప్రతిష్టాపన పీఠం పూర్తిగా నిర్మాణం కాగా మంగళవారం యాగశాల నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు మరో రెండు రోజుల్లో బ్యాలెన్స్ పనులను పూర్తిచేసుకుని పూర్తి పూజా కార్యక్రమాలకు సిద్ధం అవుతున్నట్లు కమిటీ చైర్మన్ ఇదునూరి వెంకట పాపి రెడ్డి తెలిపారు. ప్రచార కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆహ్వాన పత్రికలను పంచడం కూడా జరుగుతోందని అన్నారు. ఈ బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమాన్ని దైవ కార్యంగా భావించి ప్రతి ఒక్కరూ హాజరై దీవెనలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.