Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హుస్నాబాద్ మనబడి వజ్రోత్సవాల కార్యక్రమంలో విశిష్ట సేవలు అందించిన మునిసిపల్ కార్మికుల యూనియన్ అధ్యక్షుడు సారయ్యను కార్మికులందరి సేవా పక్షాన వజ్రోత్సవ కమిటీ మంగళవారం పాఠశాల ఆవరణలో ఘనంగా సత్కరించి వజ్రోత్సవాల జ్ఞాపకం అందజేశారు. ఈ సందర్భంగా పెద్దబడి వజ్రోత్సవ కమిటీ కన్వీనర్ మాట్లాడుతూ వజ్రోత్సవ కార్యక్రమాలలో వారం రోజులపాటు పలు రకాల సేవలను మునిసిపల్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారని, వీరి సేవలు మరువలేనివని కమిటీ సభ్యులు కొనియాడారు. హుస్నాబాద్ పెద్దబడి వజ్రోత్సవాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడానికి మునిసిపల్ సిబ్బంది సహకారం ఎంతగానో ఉందని వజ్రోత్సవాల కన్వీనర్ కొండ లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు మనీలా, కేడం లింగమూర్తి, పందిళ్ళ శంకర్, మేకల వీరన్న యాదవ్, కొత్తపల్లి అశోక్, చల్ల రాజు, వెంకటరమణ,చింతకింది శ్రీనివాస్, బూట్ల రాజ మల్లయ్య, రమణారెడ్డి, రాజగోపాలరావు, నైముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.