Authorization
Mon March 03, 2025 06:22:52 pm
నవతెలంగాణ - కర్ణాటక
కర్ణాటక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. బీజేపీని మళ్లీ గద్దెనెక్కించేందుకు తన ఛరిష్మాను ఉపయోగిస్తున్నారు. అయితే, ఇవాళ ఆయన పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. మోడీ ఎస్కార్ట్ హెలికాప్టర్ బురదలో కూరుకుపోయింది. ఆ హెలికాప్టర్ ల్యాండైన ప్రదేశం చిత్తడి ఉండడంతో ఈ పరిస్థితి ఎదురైంది. రాయచూర్ జిల్లా సింధనూరు వద్ద ఓ సభలో పాల్గొనేందుకు మోదీ వచ్చారు. హోసళ్లి క్యాంపు సమీపంలోని ఓ వరిపొలంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. కానీ ఆ పొలం ఇంకా చిత్తడిగానే ఉండడంతో, ల్యాండైన హెలికాప్టర్ మళ్లీ గాల్లోకి లేవలేకపోయింది.
దాంతో, ఓ జేసీబీ, 100 మంది మనుషుల సాయంతో హెలికాప్టర్ ను బురద నుంచి బయటికి తీసుకువచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది తప్పిదం వల్లే ప్రధాని మోదీ ఎస్కార్ట్ హెలికాప్టర్ కు ప్రమాదం ఎదురైందని భావిస్తున్నారు.