Authorization
Mon March 03, 2025 06:20:24 pm
నవతెలంగాణ - ఆదోని
బాధ్యతలు స్వీకరించిన అరగంటలోనే మరో బదిలీ ఉత్తర్వులు అందుకున్నారు కర్నూలు జిల్లా ఆదోని ఏఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా. రంపచోడవరం నుంచి బదిలీపై అదోని వచ్చిన అధిరాజ్ సింగ్ నిన్నఉదయం 11.25 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అరగంటకే కర్నూలు రావాలంటూ ఆదేశాలు అందడంతో వెంటనే ఆయన వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. కాగా, విధుల్లో కచ్చితంగా వ్యవహరించే అధిరాజ్ సింగ్ అరగంటలోనే బదిలీ కావడం వెనక రాజకీయ నేతల హస్తం ఉందని స్థానికులు చెబుతున్నారు.