Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖపట్నం: విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో బుధవారం జరుపనున్న పర్యటనల్లో కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేయనున్నారని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. విశాఖ గవర్నర్ బంగ్లాలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో ఈ ప్రాంత అభివృద్ధి కీలకం కాబోతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశాం. అన్ని అనుమతులూ రావడంతో పనులు చకచకా సాగనున్నాయి. నాలుగున్నరేళ్ల తర్వాత శ్రీకాకుళం ముఖచిత్రం మారిపోతుంది. రూ.3,500 కోట్లతో విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నాం. 2025 సెప్టెంబరు నాటికి ఇది పూర్తి అవుతుంది. విశాఖ నుంచి భోగాపురం దాకా రూ.6,500 కోట్లతో చేపట్టనున్న ఆరు లైన్ల జాతీయ రహదారికి కేంద్రం అనుమతులు మంజూరుచేసింది.