Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరంలో కొత్తగా బయోటెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు జేఎన్టీయూహెచ్ తెలిపింది. ఈ కోర్సు కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో అమలు చేస్తున్నట్టు వీసీ కట్టా నర్సింహారెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఎంసెట్ ద్వారానే ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. దీనిని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా 60 సీట్లతో ప్రవేశపెట్టనున్నామని, ఏడాది ఫీజు రూ.లక్షగా నిర్ణయించినట్టు వెల్లడించారు.