Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాంచీ: జార్ఖండ్‌లోని గుమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లికి వెళ్లి తిరిగివస్తున్న ఓ పికప్ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో సుమారు 50 మంది ఉన్నారని చెప్పారు. దుమ్రిలోని సరాన్‌దిహ్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. జార్దా గ్రామ సమీపంలో అదుపుతప్పిన వ్యాన్.. బోల్తా పడిందని, మూడుసార్లు పల్తీలు కొట్టడంతో ఐదుగురు మృతిచెందారని తెలిపారు.