Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జెడ్డా: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సూడాన్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్ కావేరీలో భాగంగా భారతీయ పౌరులతో కూడిన 12వ విమానం సౌదీఅరెబియాలోని జెడ్డా నుంచి ముంబై బయల్దేరింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఈ విమానంలో 231 మంది స్వదేశానికి తిరిగివస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మంగళవారం రాత్రి 328 మంది సూడాన్ నుంచి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకు 3 వేల మందిని క్షేమంగా తరలించామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.
సూడాన్‌లో అధికారం కోసం సైన్యంలోని రెండు గ్రూపులు ఏప్రిల్ 15 నుంచి పోరాడుతున్నాయి. దీంతో దేశంలో అశాంతి నెలకొన్నది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 24న ఆపరేషన్ కావేరీని ప్రారంభించింది. ఇప్పటివరకు 11 విమానాల్లో సూడాన్‌ను భారతపౌరులను స్వదేశానికి తీసుకొచ్చారు.