Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ద్విచక్రవాహనంపై వెళుతూ టీఎస్ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కాలుతో నెడుతున్నట్లుగా ఓ యువకుడు తీసుకున్న వీడియో ఘటనపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పాపులారిటీ కోసం రహదారులపై ఇలాంటివి చేేయవద్దని హెచ్చరించారు. మిధానీ డిపోనకు చెందిన బస్సు 104-ఎ రూట్లో వెళుతుండగా ఓ యువకుడు ద్విచక్రవాహనం నడుపుతూ ఒక కాలుతో బస్సు వెనుకభాగాన్ని నెడుతున్నట్లున్న వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను సజ్జనార్ ట్వీట్ చేస్తూ.. ప్రమాదాల బారిన పడి మీ తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని సూచించారు. ఇలాంటి వారిపై చట్టప్రకారం సంస్థ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.