Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సిట్ ఏర్పాటు జీవోలను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై స్టే విధిస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. మెరిట్ ప్రాతిపదికనే కేసు విచారణ చేపట్టాలని.. దీనిపై విచారించి తుది నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు సూచించింది. ఈ మేరకు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. సిట్ ఏర్పాటుపై స్టే ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం నేడు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.