Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ రాహుల్ గాయపడ్డాడు. అతడి మోకాలికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు వెంటనే మైదానాన్ని వీడాడు. లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో చివరి బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగాడు. గాయం కాస్త పెద్దది కావడంతో కేఎల్ రాహుల్ ఐపీఎల్‌తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది.
రాహుల్ ఇప్పటికీ మోకాలి వాపు, తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. గాయం తీవ్రత గురించి తెలుసుకోవడానికి ఈ రోజు (బుధవారం) అతడికి ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించనున్నారు. స్కానింగ్ రిపోర్టులు రావాల్సి ఉండటంతో రాహుల్ ఇప్పటికీ లఖ్‌నవూలో మెడికల్ టీమ్ అబ్జర్వేషన్లో ఉన్నాడు. రిపోర్టులు వచ్చాక అతడు బెంగళూరు బయల్దేరి వెళ్లనున్నాడు. రాహుల్ టీమిండియా కాంట్రాక్ట్ ప్లేయర్ కావడంతో అతడి బాధ్యతను బీసీసీఐ, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) తీసుకున్నాయి. ఈ వారమే రాహుల్ ఎన్సీఏలో రిపోర్ట్ చేయనున్నాడు.