Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తమిళ స్టార్ హీరో విక్రమ్ షూటింగ్లో తీవ్రంగా గాయపడ్డాడు. తంగలాన్ సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు విక్రమ్ పక్కటెముక విరిగినట్లు గుర్తించారు. అతడికి ఆపరేషన్ చేయాలని తెలిపారు. కాగా తంగలాన్ సినిమాకు కబాలి డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాళవిక మోహన్, పార్వతి మీనన్, పశుపతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడికల్ ఫిలింగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం అతడు ప్రోస్తటిక్ మేకప్ వేసుకుంటున్నాడు. తమిళ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తంగలాన్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.