जय बाबा भोलेनाथ जी की #केदारनाथ #kedarnathyatra #Kedarnathyatra2023 pic.twitter.com/wM3z8DQnuE
— uttrakhand wi fi (@rajendrabhatt) May 3, 2023
Authorization
जय बाबा भोलेनाथ जी की #केदारनाथ #kedarnathyatra #Kedarnathyatra2023 pic.twitter.com/wM3z8DQnuE
— uttrakhand wi fi (@rajendrabhatt) May 3, 2023
నవతెలంగాణ - హైదరాబాద్
కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. ఆలయ పరిసరాల్లో అడుగుతీసి అడుగు వేసే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. యాత్రీకులు తమ బస చేస్తున్న ప్రాంతానికే పరిమితమయ్యారు. హిమపాతం కారణంగా ఆక్సీజన్ లెవల్స్ పడిపోయాయని అధికారులు చెప్పారు. దీంతో వయసు పైబడిన యాత్రీకులు కొందరు ఊపిరి అందక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్‌నాథ్‌ను ఇప్పటికే నిలిపివేశారు. కేదార్ నాథ్ లో చిక్కుకున్న యాత్రికులను గుర్రాలపై కిందికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాత్రలో దాదాపు 150 మంది తెలుగువారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎడతెగని హిమపాతం కారణంగా కేదార్ నాథ్ లో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రిషికేష్‌లో యాత్రికుల రిజిస్ట్రేషన్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి యాత్ర కొనసాగుతుందని తెలిపారు. గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరో రెండు మూడు రోజులపాటు హిమపాతం కొనసాగే అవకాశం ఉందని రుద్రప్రయాగ్ కలెక్టర్ తెలిపారు.