Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ లోని కోకాపేట్ లో అత్యంత విశాలమైన ప్రాంగణంలో అతి పెద్ద ఆలయాన్ని అంతర్జాతీయ కృష్ణ చైనత్య సంఘం (ఇస్కాన్) నిర్మించబోతోంది. ఈ ఆలయ నిర్మాణానికి ఈ నెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణ నమూనాను ఇస్కాన్ ప్రతినిధులు విడుదల చేశారు. ఈ కట్టడంలో శ్రీరాధాకృష్ణ టెంపుల్, శ్రీనివాస గోవింద టెంపుల్, రాజగోపురం, నిత్యాన్నదాన హాలు ప్రధానంగా ఉంటాయి. నూతన సచివాలయంలో కేసీఆర్ ను కలిసిన ఇస్కాన్ ప్రతినిధులు శంకుస్థాపనకు ఆహ్వానించారు. తాను తప్పకుండా వస్తానని వారికి కేసీఆర్ హామీ ఇచ్చారు.