Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్ల తమ గత మ్యాచుల్లో గెలిచిన ఉత్సాహంతో ఉన్నాయి. అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని చూస్తున్నాయి. పాయింట్ల పట్టికలో ముంబై కంటే ఓ మెట్టు (ఆరో స్థానం) పైనున్న పంజాబ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఏకంగా రెండో స్థానానికి ఎగబాకుతుంది. ముంబై మాత్రం ఒకటి రెండు స్థానాలు మాత్రమే మెరుగుపరుచుకోగలుగుతుంది. ఓడితే మాత్రం కిందికి దిగజారే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ముంబై జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన మెరిడిత్ స్థానంలో ఆకాశ్ మద్వాల్ జట్టులోకి వచ్చాడు. పంజాబ్ జట్టులో రబడ బెంచ్‌కు పరిమితమయ్యాడు.