Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కుత్భుల్లాపూర్ హెటిరో ల్యాబ్స్ లో విషాదం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ప్రొడక్షన్ ఆపరేటర్ మృతి చెందాడు. ఈ రోజు ( మే3)న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రమాదవశాత్తూ కెమికల్స్ మిక్స్ చేసే యంత్రంలో పడి మహేందర్ (28) చనిపోయాడు. రసాయనాలను మార్చే క్రమంలో తీవ్ర గాయాలు కావడంతో ఆపరేటర్‌ను సమీపంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిజామాబాద్‌కు చెందిన మహేందర్ మూడు సంవత్సరాలుగా ఫార్మా యూనిట్ 3లో ఆపరేటర్‌గా పనిచేయుచున్నాడు. అయితే మహేందర్ మృతిని కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని..కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మీడియా ప్రతినిధులను కంపెనీలోకి అనుమతించకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి.