Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : లక్నో సూపర్ జెయింట్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రద్దయింది. లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైన మ్యాచ్.. లక్నో ఇన్నింగ్స్ మరో నాలుగు బంతుల్లో ముగుస్తుందనగా ఆగిపోయింది. జోరు వాన ప్రారంభం కావడం, ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. చెరో 11 పాయింట్లతో ఇరు జట్లు సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్ కారణంగా లక్నో రెండో స్థానంలో, చెన్నై మూడో స్థానంలో నిలిచాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే సమయానికి లక్నో 7 వికెట్ల నస్టానికి 125 పరుగులు చేసింది. ఐపీఎల్లో వాతావరణం సరిగా లేకపోవడం వల్ల మ్యాచ్ ఆగిపోవడం చాలా సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి.