Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది. 71 సంవత్సరాల శరత్‌బాబుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయన త్వరగా కోలుకుంటారని ఏఐజీ ఆసుపత్రి ఆశాభావం వ్యక్తం చేసింది.
మార్చిలో అనారోగ్యానికి గురైన శరత్‌బాబు చెన్నైలో చికిత్స చేయించుకున్నారు. గతవారం మరోమారు అనారోగ్యం బారినపడడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు షికారు చేస్తున్నాయి. శరత్‌బాబు మృతి చెందినట్టు కొన్ని వెబ్సైట్లలో నిన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం కూడా తెలపడంతో ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. ఆ వార్తలన్నీ పూర్తి అవాస్తవాలని, వాటిని నమ్మవద్దని శరత్ బాబు సోదరి కోరారు. ఆయన కోలుకుని తర్వలోనే డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.