Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. జాతీయ రహదారిపై ఎస్యూవీ, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 10 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా పలువురు గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించారు.ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్తరి జిల్లాలో బుధవారం అర్థరాత్రి బొలెరో ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా పలువురు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు.
జగత్రా సమీపంలోని కంకేర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.కుటుంబం సొరం నుంచి మర్కటోలాకు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది.క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించినట్లు ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన బాలిక,పిల్లలు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పురూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.