Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గోరఖ్పూర్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ సాయుధ పోలీసుల పహరా మధ్య గురువారం ఉదయం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గోరఖ్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం యోగి పిలుపునిచ్చారు.మున్సిపాలిటీల సాధికారత కోసం తప్పక ఓటు వేయండి అని సీఎం యోగి ట్వీట్ చేశారు. యూపీలోని 37 జిల్లాల్లో మొదటి విడత అర్బన్ మున్సిపల్ ఎన్నికల్లో 7,593 మంది ప్రతినిధులను ఎన్నుకోనున్నారు.