Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ఉరకలేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగ్వరంగా ప్రారంభించుకుంటున్నది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఇందులోభాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరారు. బేగంపేటలోని ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయణమయ్యారు. మధ్యాహ్నం 1:05 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభిస్తారు. అంతకుముందు ఆయన మధ్యాహ్నం 12:30 గంటలకు ఏర్పాటుచేసిన యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో పాల్గొంటారు. ముహూర్తానికి కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత మొదటి అంతస్థులోని తన చాంబర్‌కు చేరుకుంటారు. అనంతరం పార్టీ సమావేశపు హాలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో దాదాపు గంటసేపు తొలి సమావేశం నిర్వహించనున్నారు.