Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మే 7న (ఆదివారం) జరిగే ఈ పరీక్షకు అడ్మిట్ కార్డులను జాతీయ పరీక్షల సంస్థ విడుదల చేసింది. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో జరిగే ఈ పరీక్షకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల సిటీ ఇంటిమేషన్ స్లిప్లను విడుదల చేసిన ఎన్టీ.. తాజాగా హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.