Authorization
Tue April 08, 2025 12:19:45 am
నవతెలంగాణ - హైదరాబాద్
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 3 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 1,82,294 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,962 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 36,244 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 24 గంటల్లో 7,873 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,43,92,828కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,606కి ఎగబాకింది.
ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.08 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.73 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,73,435 ) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.