Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సమీపంలో దారుణ హత్య జరిగింది. హైకోర్టు గేట్ నంబర్ 6 వద్ద ఓ వ్యక్తిని దుండగుడు కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. జనం చూస్తుండగానే వ్యక్తిని పొడిచి అక్కడినుంచి పరారయ్యాడు. రూ.10 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించిన పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని స్థానికంగా ఉన్న సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న మిథున్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.