Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటున్నది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ఉరకలేస్తున్న ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగ్వరంగా ప్రారంభించుకుంటున్నది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభించనున్నారు.
బీఆర్ఎస్ భవన్ వివరాలు
స్థలం : వసంతవిహార్
విస్తీర్ణం: 1100 చదరపు మీటర్లు (1327 చదరపు గజాలు)
స్థలానికి : బీఆర్ఎస్ పార్టీ చెల్లించిన మొత్తం: రూ. 8.64 కోట్లు
భవనం: జీ ప్లస్ త్రీ
నిర్మాణ విస్తీర్ణం: 22,300 చదరపు అడుగులు
బీఆర్ఎస్ కార్యాలయ ప్రత్యేకతలు
-నాలుగు అంతస్థులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో బీఆర్‌ఎస్‌భవన్ నిర్మాణం.
-లోయర్‌గ్రౌండ్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్.
-గ్రౌండ్‌ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల చాంబర్లు.
-మొదటి అంతస్థులో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ చాంబర్, ఇతర చాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్.
-2వ, 3వ అంతస్థుల్లో మొత్తం 20 గదులు. వీటిలో పార్టీ ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్‌పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉంటాయి.