Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని అల్వాల్‌లో ఓ యువతి హల్చల్ చేసింది. తన కొత్త కారుతో బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో కారును నడిపి ఒకరి మృతికి కారణమైంది. ఈ ప్రమాదంలో రోడ్డుపక్కన ఉన్న చెరుకు రసం బండి, టిఫిన్ సెంటర్, బైక్ ధ్వంసమయ్యాయి. కానాజి గూడకు చెందిన శివాని అనే యువతి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నది. బుధవారం రాత్రి తన కొత్త కారుతో బయటకు వెళ్లిన ఆమె.. తిరుమలగిరి నుంచి మిలిటరీ డెయిర్ ఫారం వైపు వెళ్తున్నది. ఈ క్రమంలో అదుపుతప్పిన కారు.. ఓ వ్యక్తిని ఢీకొట్టింది. తర్వాత రోడ్డు పక్కన ఉన్న చెరుకు బండి, టిఫిన్ సెంటర్‌కు కగిలి.. కరెంటు స్తంభానికి ఢీకొట్టి ఆగింది. అయితే అక్కడే ఆగి ఉన్న ఓ స్కిగ్గీ బాయ్‌కు కారు తగలడంతో అతడు చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.