Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జమ్మూకశ్మీర్
జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాఢ్ సమీపంలో ఓ ఆర్మీ హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ముగ్గురు అధికారులు ఉన్నట్లు సమాచారం. మార్వా ప్రాంతంలోని నదిలో హెలికాప్టర్ శకలాలు గుర్తించారు. ఈ ప్రమాదంలో పైలట్లకు గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ‘ఆర్మీ ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాఢ్ సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో చాపర్‌లో ముగ్గురు ఉన్నారు. వారు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు’ అని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.